Social 1080×1350 • Multi-page
07-08-2024 BREAKING NEWS 03:13 AM
swarnodayam.com
Telugu Daily News

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం…. బాలల చదువు భవతికి వెలుగు అనే నినాదంతో ముందుకు పోదాం! -బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం…. బాలల చదువు భవతికి వెలుగు అనే నినాదంతో ముందుకు పోదాం! -బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్
IMG-20240807-WA0123

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం…. బాలల చదువు భవతికి వెలుగు అనే నినాదంతో ముందుకు పోదాం! అని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వలస సుభాష్ విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య నా హక్కు బాల కార్మిక వ్యవస్థను అంతం చేద్దాం అని నినాదంతో ముందుకు పోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు దేశం అభివృద్ధి చెందాలంటే విద్యార్థులే నవనిర్మాణ వ్యక్తులుగా తయారు కావాలని ఆయన అన్నారు. బాలలు పనులు చేయకండి.. పలక బలపం పట్టండి అని చిన్నారి పిల్లలను వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ రూపుమాపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. బాలల హక్కులను కాల రాయవద్దని పేర్కొన్నారు. బాలలకు స్వచ్ఛగా ఉండే వాతావరణాన్ని కల్పించాలని, ప్రతి చిన్న విషయంలో పిల్లలను మందలించవద్దని అన్నారు. బాలలు బడిలో ఉండాలని పనిలో ఉంటే నేరమన్నారు. ఇటికబట్టిలు కారిఖనాల్లో, హోటల్లో బాల కార్మికులచే పని చేయించుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మనమంతా కృషి చేద్దాం అని ఆయన సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తల్లిదండ్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. బావి బాలల ప్రగతి కోసం పునాదులు వేద్దామని అన్నారు. బాల కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పేర్కొన్నారు. పిల్లలు దేశ సంపదని, నేటి బాలలే భావి భారత పౌరులు అని వారు అన్నారు. బాల కార్మికులు గుర్తించి బడిలో చేర్పిద్దాం విద్యాబుద్ధులు నేర్పిద్దాం ఆయన కోరారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 74 వసంతాలు పూర్తి చేసుకున్న ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉండడం చాలా బాధాకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాలల హక్కులు ప్రపంచ దేశాల తీర్మానం 1989లో నవంబర్ 20వ తేదీన ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. బాలల హక్కులకు కట్టుబడి వాటికి అత్యుత్తమైన ప్రాధాన్యం ఇస్తామని ప్రపంచ దేశాలు ప్రకట కూడా జారీ చేశారని, మన దేశంలో కూడా బాలలకు తీర్మానాన్ని ఆమోదిస్తే 1992లో సంతకం చేసిందని నాటికి 192 దేశాలు బాలల హక్కులు తీర్మానం అంగీకరించాయ ని ఆయన పేర్కొన్నారు. పిల్లల హక్కుల్లో రకాలు మొత్తం 54 హక్కులను నాలుగు విధాలుగా వర్గీకరించారు అవి జీవించే హక్కు అభివృద్ధి చెంది హక్కు రక్షణ పొందే హక్కు భాగస్వామీపు హక్కు పిల్లల హక్కులు ఎవలు కాలు రాయవద్దని ఆయన పేర్కొన్నారు. పిల్లల విద్యా హక్కును సమగ్రగా పరిరక్షించుకోవడానికి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 పకడ్బందీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అందుకు అవసరమున్న నిధులు బడ్జెట్లో కేటాయించాలని ఆయన కోరారు. పని మానేసిన బడికి వస్తున్న బాలలందరికీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేయాలని లేదా అందుబాటులో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో వీరికి ప్రవేశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని ఆయన పేర్కొన్నారు విద్యార్థులు మంచి లక్ష్యాలు పెట్టుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని పేర్కొన్నారు విద్యార్థి దశ నుండి స్వయం శక్తితో అభివృద్ధికి నాంది పలకాలన్నారు. విద్యార్థి దశలో సమయాన్ని వృధా చేయకుండా పుస్తక పఠనం పై దృష్టి పెట్టాలన్నారు విద్యార్థి దశలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల కలను నిజం చేసేందుకు విద్యార్థులు దోహదపడాలని పేర్కొన్నారు. మా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల కోసం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాల్య వివాహ నిర్మూల కోసం మేము కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. చిన్నారి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆయన అన్నారు రాష్ట్రవ్యాప్తంగా బాలల హక్కుల నిరంతరంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!