Social 1080×1350 • Multi-page
07-08-2024 BREAKING NEWS 07:44 AM
swarnodayam.com
Telugu Daily News

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో రావులకారి కళ్యాణ్ కు డాక్టరేట్ ప్రధానం

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో రావులకారి కళ్యాణ్ కు డాక్టరేట్ ప్రధానం
IMG-20240807-WA0139

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన రావుల కారి కళ్యాణ్త మిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి లోని నిట్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో చేసిన పరిశోధన గాను యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. నిట్ కళాశాలలో ” సర్టైన్ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ పవర్ కంట్రోల్ టెక్నిక్స్ ఆఫ్ సింగిల్-వి ఎస్ పి ఇంటర్ ఫేస్డు విండ్ డ్రివెన్ డి.ఎఫ్.ఐ. జి.” అనే అంశంపై చేసిన పరిశోధన గాను ఇటీవల తిరుచురాపల్లిలో జరిగిన 20వ స్నాతకోత్సవంలో కళ్యాణ్ కు డాక్టరేట్ యూనివర్సిటీ అధికారులు ప్రధానం చేశారు. రావులకారి యాదగిరి-పద్మ దంపతులకు కుమారుడైన కళ్యాణ్ హుజురాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయంలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించాడు అనంతరం సిరిసిల్ల పాలిటెక్నిక్ లో ఈఈఈ పూర్తి చేసి బీవీఐఆర్టి నర్సాపూర్ లో ఇంజనీరింగ్ శ్రీ ఇందు హైదరాబాదులో ఎంటెక్ పూర్తి చేశాడు. అనంతరం వరంగల్ నిట్ లో, వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొన్నాళ్లు పనిచేశాడు. అనంతరం తిరుచారా పల్లి నిట్ లో పీహెచ్డీ పూర్తి చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో బి.ఎం.ఎస్. కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి శ్రమించి ఇంజనీరింగ్ విభాగంలో డాక్టరేట్ పొందిన కళ్యాన్ ను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, ఆదర్శ కరస్పాండెంట్ పరాoకుశం కిరణ్ కుమార్, పలువురు మేధావులు విద్యా అభిమానులు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన కళ్యాణ్ మాట్లాడుతూ… తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన కిరణ్ ప్రోత్సాహంతో ఉన్నత స్థాయికి ఎదిగానని, ఇంకా ఎదుగుతానని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!