Social 1080×1350 • Multi-page
07-08-2024 BREAKING NEWS 09:42 AM
swarnodayam.com
Telugu Daily News

బ్లాకు ఫిలిమ్స్ ఉన్న వాహనాలపై కరీంనగర్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు

బ్లాకు ఫిలిమ్స్ ఉన్న వాహనాలపై కరీంనగర్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు
IMG-20240807-WA0183

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ సిపి అభిషేక్ మొహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీం ఉల్లాఖాన్, రిజర్వు ఇన్స్పెక్టర్ స్వామి, సబ్- ఇన్ స్పెక్టర్స్ ఇషాక్ అహ్మద్, ఉపేంద్రచారి, రిజర్వు- సబ్- ఇన్ స్పెక్టర్ గణేష్, రమేష్ ల యుక్తముగా మరియు సిబ్బందితో కరీంనగర్ పట్టణంలో బద్దం ఎల్లారెడ్డి విగ్రహం, యెన్ టిఆర్ విగ్రహం వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వివిధ రకాల ప్రైవేటు వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాకు ఫిలిమ్స్ వేసుకున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కొన్ని వాహనాలపై జరిమానాలు విధించడం జరిగింది. బ్లాకు ఫిలిమ్స్ వేసుకున్న వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో బాగంగా వివిధ రకాల ప్రైవేటు వాహనాలకు ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాకు ఫిలిమ్స్ వేసుకున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ సుమారు ( 50 ) వెహికల్స్ ను చెక్ చేసి, జరిమానా విధించి అన్ లైన్ ద్వార జరిమానా కట్టివ్వడం జరిగింది. అలాగే బ్లాకు ఫిలిమ్స్ తొలగించటం జరిగింది. ఒకవేళ అదేవిధముగా కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీం ఉల్లాఖాన్ హెచ్చరించడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కరీం ఉల్లాఖాన్ మాట్లాడుతూ వాహనాలకు బ్లాకు ఫిలిమ్స్ తో వాహనాలు నడపకూదదని కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!