07-08-2024 NORMAL NEWS 12:02 PM
swarnodayam.com
Telugu Daily News
07-08-2024 12:02 PM By Mandala Yadagiri

పల్లె శ్రీనివాస్ మృతి బిజెపికి తీరని లోటు..! -నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి

పల్లె శ్రీనివాస్ మృతి బిజెపికి తీరని లోటు..! -నివాళులర్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి
IMG_20240807_225907

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు పల్లె శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం పార్టీకి తీరని లోటని, ఆయన మృతి చెందడం పట్ల బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బుధవారం బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ పార్దివ దేహానికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు. శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఆయనతో పాటు పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బీజేపీ నాయకులు కోట్టే మురళీకృష్ణ, సింగిరాల రామరాజు, తూర్పాటి రాజు, ఎండీ అజార్, యాల్ల సంజీవరెడ్డి, యాంశని శశిధర్, సబ్బనీ రమేష్, గంగిశెట్టి ప్రభాకర్, కోలిపాక శ్రీనివాస్, చింత శ్రీనివాస్, పడారి కొమురయ్య, దండ సమ్మిరెడ్డి, నరాల రాజశేఖర్, నాగరాజు, నగేష్, హృత్విక్, సుభాష్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!