Social 1080×1350 • Multi-page
08-08-2024 BREAKING NEWS 01:31 AM
swarnodayam.com
Telugu Daily News

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి. — హుజురాబాద్ బార్ అసోసియేషన్.

న్యాయవాదులపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి. — హుజురాబాద్ బార్ అసోసియేషన్.
IMG_20240808_122831

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: జనగామ పట్టణంలో న్యాయవాద దంపంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హుజురాబాద్ కోర్టు ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసుల దాడిని వ్యతిరేకిస్తూ గురు, శుక్రవారాలు న్యాయవాదులు తమ కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియన్ ప్రధాన కార్యదర్శి మట్టెల తిరుపతి, సీనియర్ న్యాయవాదులు వీరసేనారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ముక్కెర రాజు, నల్ల భూమిరెడ్డి, బండి కళాధర్, పులుగు లింగారెడ్డి, బండి రమేష్, నక్క సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, ముషం మౌనిక, విక్రం. రవితేజ, ప్రవీన్, కుమారస్వామి, మాధవి, సరిత, దివ్య, ఆడేపు లింగమూర్తి, దేవయ్య, విజయ్ కుమార్ తదితరులు పాల్గోన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!