Social 1080×1350 • Multi-page
08-08-2024 BREAKING NEWS 02:47 AM
swarnodayam.com
Telugu Daily News

TPCC ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా తిప్పారపు సంపత్ నియామకం

TPCC ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా తిప్పారపు సంపత్ నియామకం
IMG_20240808_134722

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:TPCC ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా హుజురాబాద్ పట్టణానికి చెందిన తిప్పారపు సంపత్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో గతం నుండి విద్యార్థులు వారి సమస్యలు పరిష్కరించుటకై ఉమ్మడి జిల్లాలో ఎన్నికల పద్ధతిలో నన్ను NSUI జిల్లా అధ్యక్షులుగా, నిరుద్యోగ యువత కోసమై నన్ను గతంలో ఎన్నికల పద్ధతిలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్నారు. ఇప్పుడు దళిత జాతి సమస్యల పరిష్కరించుటకై నాకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను దళిత జాతి కోసం పనిచేస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ TPCC ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా నియమించిన రాష్ట్ర ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రితంకి, నా నియమకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహకి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ కి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ రమేష్ బాబు కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!