Social 1080×1350 • Multi-page
08-08-2024 BREAKING NEWS 06:30 AM
swarnodayam.com
Telugu Daily News

సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ను అభినందించిన కలెక్టర్ పమేల సత్పతి

సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ను అభినందించిన కలెక్టర్ పమేల సత్పతి
IMG-20240808-WA0123(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజికవేత్త నలుబాల వేణుగోపాల్ ను జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి అభినందించారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధం కోసం వేణుగోపాల్ చేస్తున్న కృషిని, పర్యావరణం బాగుండడం కోసం తాను నాటిన మొక్కల గురించి, కోతుల కోసం చేస్తున్న శ్రమను గురించి, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తాను తీసుకుంటున్న వివిధ చర్యల గురించి ఆయన కలెక్టర్ కు వివరించారు. ప్లాస్టిక్ నిషేధం పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తున్నందుకు వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ పమేల సత్పతి నలుబాల వేణుగోపాల్ ను ప్రత్యేకంగా అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ సమాజ అభివృద్ధికి పాటుపడాలని తగిన గుర్తింపు దానంతట అదే వస్తుందని సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!