Social 1080×1350 • Multi-page
08-08-2024 BREAKING NEWS 09:30 AM
swarnodayam.com
Telugu Daily News

కొత్తపల్లి మున్సిపల్‌ వైస్ చైర్‌ పర్సన్‌గా అంజలి. -ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారి

కొత్తపల్లి మున్సిపల్‌ వైస్ చైర్‌ పర్సన్‌గా అంజలి. -ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారి
IMG_20240808_202843

స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: కొత్తపల్లి మున్సిపల్‌ వైస్ చైర్‌ పర్సన్‌గా 4వ వార్డు కౌన్సిలర్‌ జెరిపోతుల అంజలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు అంజలికి పూర్తి మద్దతు ప్రకటించడంతో ఆమె వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కొత్తపల్లి మున్సిపల్‌ వైస్ చైర్‌పర్సన్‌గా గతంలో కొనసాగిన 2వ వార్డు కౌన్సిలర్‌ బండ రాధ మరణించడంతో వైస్ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. ఇటీవల ఎన్నికల కమిషన్‌ కొత్తపల్లి మున్సిపల్‌ వైస్ చైర్మన్‌ ఎంపిక కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయగా గురువారం ఎన్నిక నిర్వహించారు. కొత్తపల్లి మున్సిపల్‌లో 12 మంది కౌన్సిలర్లు ఉండగా 2వ వార్డు కౌన్సిలర్‌ మరణించడంతో 11 మంది కౌన్సిలర్లు ప్రస్తుతం కొనసాగుతున్నారు. వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నిక కోసం ఏడుగురు కౌన్సిలర్లు హాజరుకాగా కోరం సరిపోవడంతో వైస్ చైర్‌పర్సన్‌కు ఎన్నిక నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు 4వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్న జెరిపోతుల అంజలిని వైస్ చైర్మన్‌గా ప్రతిపాదించగా 10వ వార్డు కౌన్సిలర్‌ గండు రాంబాబు మద్దతు తెలిపారు. ఎన్నికకు హాజరైన సభ్యులు పూర్తిగా అంజలిని వైస్ చైర్మన్‌గా మద్దతు తెలుపడంతో ఆమె విజయం సాధించింది. ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఆర్డీవో అంజలికి అందజేశారు. తన నియామానికి సహకరించిన మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లకు అంజలి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అంజలిని వైస్ చైర్మన్‌గా ఎంపిక చేసేందుకు కృషిచేసిన కరీంనగర్‌ శాసనసభ్యుడు గంగుల కమలాకర్‌, మాజీ జడ్పీ జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలుద్దీన్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!