Social 1080×1350 • Multi-page
08-08-2024 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

సీఐ రాజేష్ కుటుంబానికి మిత్రుల చేయూత!

సీఐ రాజేష్ కుటుంబానికి మిత్రుల చేయూత!
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన ఇన్స్పెక్టర్(సిఐ) రాజేష్ కుటుంబానికి తోటి బ్యాచ్ ఇన్స్పెక్టర్లు రూ. 16 లక్షల 80 వేల రూపాయల ఆర్ధిక సహాయం చేసి చేయూతను అందించారు. వరంగల్ ఆటోనగర్ కు చెందిన సైరి రాజేష్ (42) 2007వ సంవత్సరంలో పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ గా చేరారు. ఇన్స్పెక్టర్ గా పదోన్నతి కూడా పొందారు. అనారోగ్య కారణంగా గత ఫిబ్రవరి నెలలో మరణించారు. మృతుడికి భార్య రాధ, ఒక కూతురు హాసిని(11), కొడుకు కార్తికేయ(8) వున్నారు. మరణించిన తన స్నేహితుడి కుటుంబానికి తోటి బ్యాచ్ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి తమవంతుగా మొత్తం రూ .16 లక్షల 80 వేల రూపాయల చేకూర్చి గురువారం ఇన్స్పెక్టర్ లు సృజన్ రెడ్డి , బొల్లం రమేష్ యాదవ్, వి శ్రీనివాస్, ఎల్ఎండి ఇన్స్పెక్టర్ స్వామి తదితరులు మృతుడి భార్య మరియు పిల్లలకు చెక్ అందించి తమ స్నేహభావాన్ని చాటుకున్నారు. స్నేహితుని ఆదుకునేందుకు ముందుకు వచ్చి చేయూతనందించిన 2007వ సంవత్సరం సబ్ ఇన్స్పెక్టర్లను పలువురు అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!