Social 1080×1350 • Multi-page
10-08-2024 BREAKING NEWS 08:39 AM
swarnodayam.com
Telugu Daily News

సువర్ణకు జయన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం

సువర్ణకు జయన్న ఫౌండేషన్ ఆర్థిక సహాయం
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డబ్బులు చెల్లించలేని దుర్భర పరిస్థితుల్లో నిరుపేద బాధితురాలికి నేనున్నానంటూ జయన్న ఫౌండేషన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేసింది. వివరాల్లోకి వెళితే….హుజురాబాద్ మండలం కనుకులగిద్ద గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన కొత్తూరి జీవన్ కుమార్ భార్య సువర్ణకు మెదడులో రక్తం గడ్డ కట్టి ప్రమాదకరమైన స్థితిలో రెండు నెలల క్రితం హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చేరింది . వైద్యులు పరీక్షించి అన్ని రకాల పరీక్షలు చేసి మెదడుకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. రోజువారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న జీవన్ కుమార్ ఆపరేషన్ ఖర్చులకు పలువురు వద్ద లక్షల రూపాయలు అప్పులు చేసి ఆపరేషన్ చేయించాడు. ప్రస్తుతం సోమాజిగూడలోని గుడ్ లైఫ్ రిహాబిటేషన్ సెంటర్ లో చికిత్స నిర్వహిస్తున్నారు. సువర్ణ కుటుంబ ధిన స్థితిని తెలుసుకున్న జైయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి శనివారం 10 వేల రూపాయలను జీవన్ కుమార్ కు అందజేశారు. అంతేకాకుండా అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పి ధైర్యాన్ని అందించాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, ఎమ్ఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిప్పారపు భువనచంద్ర , సీనియర్ గాయకుడు రామ్ రాజేశ్వర్, నాయకులు బత్తుల రాజలింగం, రామ్ సారయ్య, దాట్ల ప్రభాకర్, కలకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!