11-08-2024 NORMAL NEWS 06:32 AM
swarnodayam.com
Telugu Daily News
11-08-2024 06:32 AM By Mandala Yadagiri

మంద కృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీకి లక్షలాదిగా తరలిరండి

మంద కృష్ణ మాదిగ విజయోత్సవ ర్యాలీకి లక్షలాదిగా తరలిరండి
IMG-20240811-WA1358

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:


మహాజననేత మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగ మరియు ఉపకులాల అభివృద్ధికి దోహదపడే ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన విజయం సాధించి ఢిల్లీ నగరం నుండి ఆగస్టు 13న హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా బషీర్ బాగ్ చౌరస్తాలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వరకు లక్షలాదిమంది మాదిగ మరియు ఉప కులాల, ప్రజాస్వామిక వాదులతో జరిగే విజయోత్సవ ర్యాలీకి హుజురాబాద్ మండలంలో ఉన్న ప్రతి మాదిగ పల్లె నుండి మాదిగ యువకులు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, డప్పు కళాకారులు తదితర యావత్తు మాదిగ జాతి ప్రజలు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రంమాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాదు ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాదిగల సూర్యుడు మందకృష్ణమాదిగ నిరంతర పోరాటాన్ని, మాదిగల ఆకాంక్షను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గుర్తించి సంచలన తీర్పునిచ్చారన్నారు. కనూక మాదిగ మరియు ఉపకులాల ప్రజలందరూ లక్షలాదిగా హైదరాబాద్ నగరానికి తరలివచ్చి ర్యాలీని మరియు సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్ తునికి సమ్మయ్య , బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి కలవల మల్లయ్య, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి వేల్పుల ప్రభాకర్, నాయకులు కొత్తూరు జీవన్ కుమార్, కనకం శ్రీకాంత్ పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!