12-08-2024 NORMAL NEWS 12:26 AM
swarnodayam.com
Telugu Daily News
12-08-2024 12:26 AM By Mandala Yadagiri

సోషల్ మీడియా వారియర్ పబ్బ రజనీకాంత్ కు కేంద్ర మంత్రి బండి పరామర్శ

సోషల్ మీడియా వారియర్ పబ్బ రజనీకాంత్ కు కేంద్ర మంత్రి బండి పరామర్శ
1000161337

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన బిజెపి
సోషల్ మీడియా వారియర్ పబ్బా రజనీకాంత్.
తండ్రి పబ్బా మహేందర్ (రేషన్ డీలర్) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. తండ్రిని కోల్పోయి విషాదంలో వున్న బీజేపీ సైనికుడు పబ్బ రజనీకాంత్ కుటుంబాన్ని ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. మహేందర్ భౌతికకాయంపై పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగడు కృష్ణారెడ్డి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అలాగే సోమవారం ఉదయం మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్, కొలిపాక నిర్మల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పలువురు సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!