Social 1080×1350 • Multi-page
13-08-2024 BREAKING NEWS 08:42 AM
swarnodayam.com
Telugu Daily News

ఆరు గ్యారంటీల అమలు చేసేవరకు పోరాడుతాం.! ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.

ఆరు గ్యారంటీల అమలు చేసేవరకు పోరాడుతాం.! ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
IMG_20240813_193946

డిసెంబర్ 9 నుంచి జరిగిన పెళ్లిలన్నింటికీ తులం
బంగారం ఇవ్వాలి

-పేదల పెన్నిధి కేసీఆర్

-రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ పార్టీ

-ఇంటింటికి వెళ్లి చెక్కులు పంచిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు

–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధి అయ్యాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజరాబాద్ నియోజకవర్గం లోని చెల్పూర్, ఇంద్రనగర్ రాజపల్లి, రాంపూర్, రంగాపూర్ పోతిరెడ్డిపేట్, సిర్సపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. పేద బిడ్డల పెళ్లిల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోత్తరమైన కల్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకుచ్చి ప్రతి పేద ఇంటి మేనమామ అయ్యాడని అన్నారు. అలాగే కెసిఆర్ కిట్, దళిత బంధు, రైతుబంధు, రుణమాఫీ, వృద్ధాప్య పింఛన్ల పెంపు, వికలాంగుల పెన్షన్ల పెంపు లాంటి ఎన్నో పథకాలు కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. పేదవాళ్లకు తాగునీరు అందించాలనే సంకల్పంతో మిషన్ భగీరథ చేపట్టారని, రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు కాలేశ్వరం ప్రాజెక్టుతో పాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల కరెంటు అందించిన ఘనత కూడా కేసీఆర్ దే అని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని, ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష 116 లతోపాటు తులం బంగారం ఇస్తానని చెప్పారని వెంటనే దానిని లబ్ధిదారులందరికి అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న వారందరికీ ఈ పథకం కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన సతీమణి శాలినీరెడ్డి తో కలిసి లబ్దిదారుల ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఎక్కడ ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ చైర్ మెన్లు గందె రాధిక శ్రీనివాస్, తక్కలపల్లి రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎంపీపీ రాణి,సురేందర్ రెడ్డి, వివిద గ్రామాల మాజీ సర్పంచ్ లు, కౌన్సిలర్లతోపాటు అధికారులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!