Social 1080×1350 • Multi-page
13-08-2024 BREAKING NEWS 10:54 AM
swarnodayam.com
Telugu Daily News

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి లేఖను ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డికి అందజేసిన పోస్టల్ అధికారులు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి లేఖను ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డికి అందజేసిన పోస్టల్ అధికారులు
1000175665

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు13 : స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు 09 ఆగస్టు నుండి 15 ఆగస్టు వరకు దేశమంతటా నిర్వహిస్తోందని, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నేడు హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పెద్దపల్లి పోస్టల్ సూపర్డెంట్ పసునూరి ప్రభాకర్ మరియు హుజురాబాద్ ప్రధాన తపాలా సిబ్బంది కలిసి జాతీయ జెండాను అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ ఉత్తరాన్ని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తపాలా అధికారులు బట్వాడ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సూపర్డెంట్ పసునూరి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి పోస్ట్ ఆఫీస్ లో కేవలం 25 రూపాయలకే జాతీయ జెండాలు ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని దేశభక్తితో ప్రజలందరూ కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రమేష్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు డాక్టర్ సంఘం ఐలయ్య, నాయకులు, పోస్టల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ జమ్మికుంట మోహన్, హుజురాబాద్ పోస్ట్ మాస్టర్ అమర్నాథ్ రెడ్డి, డిపిఎం యు మహేందర్ మరియు హుజురాబాద్ తపాలా సిబ్బంది ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!