Social 1080×1350 • Multi-page
14-08-2024 BREAKING NEWS 08:33 AM
swarnodayam.com
Telugu Daily News

సతీష్ కుమార్ కృషితోనే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు

సతీష్ కుమార్ కృషితోనే నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు
IMG-20240814-WA1128

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,సైదాపూర్ : హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ కృషితోనే సైదాపూర్ మండలంలోని మూడు నూతన గ్రామ పంచాయతీలకు గెజిట్ విడుదల అయిందని రామచంద్రాపూర్ తాజా మాజీ సర్పంచ్ రేగుల సుమలత-అశోక్ పేర్కొన్నారు. బుధవారం సైదాపూర్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలపడంతో పంచాయతీల ఏర్పాటుకు మార్గం సులభతరమైందన్నారు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ మండలంలోని కుర్మపల్లి, గొల్లగూడెం, గెర్రెపల్లి గ్రామపంచాయతీలో ఏర్పాటు కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆయన కృషి వల్లనే సైదాపూర్ మండలంలో నూతనంగా మూడు గ్రామపంచాయతీలు ఏర్పడడం పట్ల సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!