Social 1080×1350 • Multi-page
14-08-2024 BREAKING NEWS 09:34 AM
swarnodayam.com
Telugu Daily News

తహసిల్దార్, టౌన్ సిఐని సన్మానించిన వివిధ సంఘాల నాయకులు.

తహసిల్దార్, టౌన్ సిఐని సన్మానించిన వివిధ సంఘాల నాయకులు.
Oplus_0

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:

హుజురాబాద్ నూతన తహశీల్దార్ కోడెం కనకయ్యను బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకొని ప్రజా సంఘాల నాయకులు సన్మానించారు. మండల ప్రజలకు సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో RTI జిల్లా కన్వీనర్ గూడూరి స్వామిరెడ్డి (లోక్ సత్తా), GK రైతు మిత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, యునైటెడ్ ఫోరం ఫర్ RTI ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి తులసి లక్ష్మణ మూర్తి, MRPS నాయకులు మారేపల్లి శ్రీనివాస్, కోటోజు జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.

వైస్ ఎంపీపీ బండి రమేష్ సత్కారం!

హుజురాబాద్ తాసిల్దారుగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన కోడ కనకయ్యను, టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన జి తిరుమల్ ను హుజురాబాద్ తాజా మాజీ వైస్ ఎంపీపీ బండి రమేష్ ఎంపిటిసి నాగరాజులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు.

టౌన్ సిఐని సన్మానించిన బిజెపి నేతలు:

హుజురాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి తిరుమల్ ని బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిఐని కలిసిన వారిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు, ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, ఉపాధ్యక్షులు అంకటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు యమసాని శశిధర్, తిప్పపతిని రాజు తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ సీఐని మర్యాదపూర్వకంగా కల్సిన కాంగ్రేస్ నాయకులు

హుజురాబాద్ మండల(టౌన్) సీఐ జీ తిరుమల్ ని కరీంనగర్ జిల్లా కాంగ్రేస్ సేవాదల్ అధ్యక్షులు పత్తి మధుబాబు మరియు కాంగ్రేస్ పార్టీ హుజురాబాద్ మండల సీనియర్ నాయకులు నరెడ్ల వినోద్ రెడ్డి, రాజు కలిసి సీఐని శాలువాతో ఘనంగా సన్మానించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!