Social 1080×1350 • Multi-page
14-08-2024 BREAKING NEWS 10:02 AM
swarnodayam.com
Telugu Daily News

శ్రావణమాసం సందర్భంగా మున్నూరు కాపుల సన్నాహక సమావేశం!

శ్రావణమాసం సందర్భంగా మున్నూరు కాపుల సన్నాహక సమావేశం!
1000186275

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హుజురాబాద్ నియోజకవర్గం మున్నూరు కాపుల ఐక్యత కోసం శ్రావణమాసం సందర్భంగా మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం బుధవారం రోజున స్థానిక జమ్మికుంట పట్టణములోని ఎంపీఆర్ గార్డెన్లో మున్నూరు కాపు ఆత్మీయ సన్నాహాక సమావేశం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ముఖ్య నాయకులు హాజరై వారు మాట్లాడుతూ మున్నూరు కాపుల ఐక్యత కోసం శ్రావణమాసం చివరి వారంలో స్థానిక దుబ్బ మల్లన్న దేవస్థానం ఆవరణలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం చేయాలని కోలాటాలు బోనాలు మల్లన్న పట్నాలు వనభోజనాలతో కార్యక్రమం నిర్వహించబడునని తదుపరి తేదీని ఆదివారం రోజు ఎంపిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు ముఖ్య నాయక్ తో సమావేశం నిర్వహించి చివరి తేదీ తెలియజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జమ్మికుంట పి ఎ సి ఎస్ చైర్మన్ పోనగంటి సంపత్, ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి రాము, పంతాటి రవీందర్, పొనగంటి రవీందర్, (పీజేఆర్ )ఎడ్ల రాజేందర్, సైదాబాద్ మాజీ సర్పంచ్ రాజారాం, కొండపాక మాజీ సర్పంచ్ దాట్ల వీరస్వామి, రాకం శ్రీనివాస్, సుందరయ్య, ఉడుగుల మహేందర్, ఆకుల పోశయ్య, అడువాల శ్రీధర్, పొనగంటి సందీప్, కోలకానీ రాజు, గాజుల తిరుపతి, అప్పల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!