Social 1080×1350 • Multi-page
16-08-2024 BREAKING NEWS 12:46 PM
swarnodayam.com
Telugu Daily News

కందుగులలో రేషన్ బియ్యం పట్టివేత

కందుగులలో రేషన్ బియ్యం పట్టివేత
1000207753

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ కందుగుల గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా కందుగుల గ్రామానికి చెందిన గందే తిరుపతి TVS Shamp పై రెండు ప్లాస్టిక్ బ్యాగులు నిండువి తీసుకొని వెళుతూ పోలీస్ లను చూసి పారిపోతుండగా అనుమానంతో పట్టుకొన్నట్లు టౌన్ సీఐ జి తిరుమల్ తెలిపారు. పంచుల సమక్షంలో విచారించగా గందె తిరుపతి కందుగుల గ్రామంలో ఉన్న హుజురాబాద్ కు చెందిన మహాలక్ష్మి రైస్ మిల్ ఓనర్ అయిన ముషం వెంకటేశ్వర్లు పేద ప్రజలకు ఇచ్చే బియ్యం PDS బియ్యంను డబ్బులు ఆశ చూపి వారిని మోసం చేసి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రైస్ మిల్ ఓనర్ కు అమ్మగా అట్టి నా దగ్గర కొనుగోలు చేసిన బియ్యంను ముశం వెంకటేశ్వర్లు కొనుగోలు చేసి అట్టి బియ్యమును ముక్కలుగా చేసి కోళ్ల ఫారాలకు ఇతర అవసరాలకు ఎక్కువ ధరలకు అమ్మి లాభం పొందుతున్నాడని బాధితుడు తెలిపారు. ఈ బియ్యం కూడా అతనికి అమ్ముటకు తీసుకు వెళుతున్నానని చెప్పగా పోలీసులు అతనినీ తీసుకొని అ మహాలక్ష్మి రైస్ మిల్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ ఇదివరకు కొనుగోలు చేసిన ఐదు క్వింటాళ్ల PDS బియ్యం ఉండగా పంచుల సమక్షంలో అట్టి బియ్యంను సీజ్ చేసి అ బియ్యంతో సహా వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు ఇన్స్పెక్టర్ జి తిరుమల్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అట్టి బియ్యం అందాజా 06 క్వింటాల్ ఉండే విలువ సుమారు 10.800/- వందలు రూపాయలు ఉండేవి, దీనితో పాటుPds బియ్యం రవాణాకు ఉపయోగించిన Tvs Shamp ను సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు.
ఎవరైనా PDS బియ్యం కొనుగోలు చేసిన, అమ్మిన, రవాణా చేసిన వాటిని వేరే విధంగా తయారు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!