Social 1080×1350 • Multi-page
17-08-2024 BREAKING NEWS 04:13 AM
swarnodayam.com
Telugu Daily News

బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
IMG_20240817_150913

–తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ అంతక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
-కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పి
50000 ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ రమేష్ నిన్న అనారోగ్యంతో నిన్న చనిపోయారు. బండ రమేష్ తీన్మార్ మల్లన్న గెలుపులో హుజురాబాద్ బై ఎలక్షన్ లో మరియు తీన్మార్ మల్లన్న టీం తరఫున ఎక్కడ పిలుపు ఇచ్చిన అక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హుజురాబాద్ పట్టణానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి రూ. 50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజిని కుమార్, వివిధ జిల్లాల తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తీన్మార్ మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనారోగ్యంతో మృతి చెందిన
బండ రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్.

హుజురాబాద్ పట్టణంలోని బండ అంకుష్ వాడ లోని బండ అంకుష్ కుమారుడైన బండ రమేష్ అనారోగ్యంతో శుక్రవారం రోజున చనిపోయిన విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి పూలమాల వెసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని వ్యక్తము చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిప్పారపు భువనచంద్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర కుమార్, ఇమ్మడి రాజయ్య, రాచపల్లి ఓదెలు, గాజుల సంపత్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!