17-08-2024 NORMAL NEWS 08:27 AM
swarnodayam.com
Telugu Daily News
17-08-2024 08:27 AM By Mandala Yadagiri

ఆల్ఫోర్స్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు.!

ఆల్ఫోర్స్ లో ఘనంగా రక్ష బంధన్ వేడుకలు.!
IMG_20240817_192538

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ముందస్తు రక్ష బంధన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థినిలు విద్యార్థులకు రాఖీలు కట్టారు. తమ శ్రేయస్సు కోరుతూ రాఖీలు కట్టడం పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రాఖీల తయారీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. తమ పాఠశాలలో పండుగల విశిష్టతో పాటు సామాజిక అంశాలపైన అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాఖీ పండుగా దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగని, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అని దేశభక్తి చాటుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!