Social 1080×1350 • Multi-page
18-08-2024 BREAKING NEWS 07:25 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు..

ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు..
IMG_20240818_182157

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఆవరణలో హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం ఎన్నికల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికలలో భారీ ఎత్తున పద్మశాలి కుల బాంధవులు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రo ఏర్పాటుకు సహకరించిన హుజూరాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్ కి, ఉపాధ్యక్షులు వేముల యాదగిరికి మరియు కార్యాలయం మేనేజర్ నక్క వైకుంఠంకి సహకరించిన కార్యాలయ సిబ్బందికి, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, పోలీసు సిబ్బందికి, ఎన్నికల ఆఫీసర్లుగా వ్యవహరించిన సబ్బని శివాజీ, సబ్బని రవీందర్, ఎనగందుల వెంకటేశ్వర్లుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ఇల్లంతకుంట మండలం, జమ్మికుంట పట్టణం, వీణవంక, కేశవపట్నం మండలంల నుండి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న పద్మశాలి కుల బాంధవులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ పోలింగ్ కేంద్రాన్ని కేశవపట్నం మండలం పద్మశాలి సంఘం నాయకుడు,రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ సందర్శించి నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు (trps) సంగెం సత్యనారాయణ, జిల్లా కో కన్వీనర్ చిలకమర్రి శ్రీనివాస్, హుజురాబాద్ పట్టణ పద్మశాలి నాయకులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, కుడికాల సాయి, కూరపాటి రామచంద్రం తదితర కుల బాంధవులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!