Social 1080×1350 • Multi-page
18-08-2024 BREAKING NEWS 08:15 AM
swarnodayam.com
Telugu Daily News

హిందువులపై దాడులకు నిరసనగా హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ శాంతి ర్యాలీ

హిందువులపై దాడులకు నిరసనగా హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ శాంతి ర్యాలీ
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బంగ్లాదేశ్ లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను, కోల్ కత్తాలో డాక్టర్ పై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆదివారం హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పాస్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. బంగ్లాదేశంలోని హిందువులపై జరుగుతున్న దాడులు అత్యంత దారుణమని అన్నారు. ఇంతే కాకుండా అక్కడ దేవాలయాలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారం జరగడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజ్ కుమార్, చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!