Social 1080×1350 • Multi-page
18-08-2024 BREAKING NEWS 08:43 AM
swarnodayam.com
Telugu Daily News

డాక్టర్ పై అత్యాచారం పట్ల మౌన నిరసన

డాక్టర్ పై అత్యాచారం పట్ల మౌన నిరసన
IMG-20240818-WA1947

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: కోల్ కత్తాలో డాక్టర్ మౌనితపై అత్యాచారం సంఘటనను నిరసిస్తూ ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ఆధ్వర్యంలో మౌన మౌన ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వైద్య వృత్తి పవిత్రమైనదని, వైద్యులు దేవుడితో సమానమని అన్నారు. అత్యాచారం జరగడం అమానవీయామని, అలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరూ ఖండించాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, డాక్టర్ కూరపాటి సుస్మిత, మాజీ కౌన్సిలర్ భీమగోని సురేష్, యాదగిరి, ఈశ్వర్ రెడ్డి, సారంగపాణి, జన్నయ్య, బత్తుల రాజలింగం, విద్యానంద్, హనుమంతచారి, రమేష్, వేల్పుల ప్రభాకర్, పంజాల శ్రీధర్ గౌడ్, మొగిలి, సాదుల రవీందర్ బాబు, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!