Social 1080×1350 • Multi-page
18-08-2024 BREAKING NEWS 09:08 AM
swarnodayam.com
Telugu Daily News

టివైజెఎఫ్ జాతీయ ఛాంబర్ చైర్మన్ పివి ప్రభాకర్ రావును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆ సంఘ సభ్యులు

టివైజెఎఫ్ జాతీయ ఛాంబర్ చైర్మన్ పివి ప్రభాకర్ రావును కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆ సంఘ సభ్యులు
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, జమ్మికుంట ఆగస్టు18: తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ ఛాంబర్ చైర్మన్ పివి ప్రభాకర్ రావు జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు నీల నాగరాజు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరితో కలిసి పివీ ప్రభాకర్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నీల నాగరాజు మాట్లాడుతూ రానున్న కాలంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ను రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి సర్వశక్తుల స్వయంకృషితో పోరాడతామని, జర్నలిస్ట్ అంటే ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి అని అన్నారు. జర్నలిస్ట్ లు అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. జర్నలిజానికి తగిన న్యాయం చేసి రాష్ట్ర అభ్యున్నతికి మావంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆయన వెంట సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!