Telugu Daily News
చదువుతోపాటు శారీర దృఢత్వానికి కరాటే ఎంతో అవసరం

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్:
చదువుతో పాటు విద్యార్థి శారీర దృఢత్వానికి కరాటే ఎంతో అవసరమని మాంటిస్సోరి ప్రిన్సిపల్ గీతా షాజు అన్నారు. మంగళవారం పట్టణంలోని కాకతీయకాలనీ గల మాంటిస్సోరి పాఠశాల ఆవరణలో గ్లోబల్ చోటా ఖాన్ కరాటే డు ఇండియా జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరు నారాయణరెడ్డి మొదటి జాతీయ స్థాయి కరాటే టోర్నమెంట్లో హుమేరా తస్నీమ్ బంగారు పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆమె మాట్లాడారు. విద్యార్థి తనలో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజు తామస్, నూకల శ్రీనివాస్ రావు, గండ్ర సుధాకర్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


