Social 1080×1350 • Multi-page
20-08-2024 BREAKING NEWS 01:08 PM
swarnodayam.com
Telugu Daily News

భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సింగిరాల రామరాజు

భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సింగిరాల రామరాజు
1000253321

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: భారతీయ జనతా పార్టీ యువమోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గ హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామానికి చెందిన సింగిరాల రామరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ నియామక పత్రంలో పేర్కొన్నారు. సింగిరాల రామరాజు విద్యార్థి నాయకునిగా ఏబీవీపీలో పనిచేసి అంచలంచలుగా ఎదిగి భారతీయ జనతా పార్టీ విస్తరణకు కృషి చేశారు. కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శిష్యునిగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితాన్ని గడిపారు. గత ఎన్నికల ముందు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ సామాన్య కార్యకర్తకు కూడా భారతీయ జనతా పార్టీలో మాత్రమే అందలం దక్కుతుందని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో బాధ్యతతో పార్టీ విస్తరణ కోసం పనిచేస్తానని, కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ,బీజేపీ రాష్ట్ర నాయకులు కొట్టే మురళీకృష్ణకి, జిల్లా అధ్యక్షులు గంగాడు కృష్ణారెడ్డికి, జిల్లా పార్టీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!