Social 1080×1350 • Multi-page
21-08-2024 BREAKING NEWS 12:18 AM
swarnodayam.com
Telugu Daily News

రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల ఆదాయం రాబట్టిన తెలంగాణ ఆర్టీసీ

రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల ఆదాయం రాబట్టిన తెలంగాణ ఆర్టీసీ
IMG-20240821-WA0866

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల ఆదాయం రాబట్టింది. రాఖీ పూర్ణిమ పండగ వేళ తెలంగాణ ఆర్టీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాఖీ రోజు రికార్డు స్థాయిలో 63 లక్షల మంది ప్రజలు TGSRTC బస్సుల్లో ప్రయాణించారని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వీరిలో 41.74 లక్షల మంది మహిళలు ఉన్నారన్నారు. “రాఖీ నాడు రూ.32 కోట్ల వరకు రాబడి వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకంతో రూ.17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయి. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్ టైం రికార్డు” అని చెప్పారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!