Social 1080×1350 • Multi-page
21-08-2024 BREAKING NEWS 04:26 AM
swarnodayam.com
Telugu Daily News

పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బిజెపి ఆధ్వర్యంలో ధర్నా, తాసిల్దార్ కు వినతి

పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని బిజెపి ఆధ్వర్యంలో ధర్నా, తాసిల్దార్ కు వినతి
1000259761

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: బిజెపి హుజురాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి తాసిల్దార్ కనుకయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ హాజరై మాట్లాడుతూ.. ప్రస్తూత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాoగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పిందని, కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదన్నారు. రైతుల ఓట్ల కోసం రుణ మాఫీ హామీ ఇచ్చి నిబంధనల పేరుతో అనర్హులను చేసి రైతులను దగా చేస్తుందని, ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు లేకుండా వర్తింప చేయాలన్నారు. రేషన్ కార్డు పేరుతో, ఐటీ పేరుతో, ఉద్యోగస్తుల పేరుతో, భార్యభర్తలను వేరు చేసి తలా లక్ష ఇలాంటి షరతులతో రైతులను పథకానికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుందని.. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ రైతుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని అందరికీ రెండు లక్షలూ స్కీమ్ వర్తించే దాకా విశ్రమించేది లేదని కరుణాకర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 47 లక్షల పైగా రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 22 లక్షల మందికి మాత్రమే 17934 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇందులో కూడా నిన్న ఆర్థిక శాఖ మంత్రి రూ.7000 కోట్లు మాత్రమే క్రెడిట్ అయినాయి అని చెప్పడం జరిగిందని, మిగతా రైతులందరికీ రుణమాఫీ కాలేదన్నారు. అసలు రైతుబంధు ఇవ్వాల్సిన ప్రభుత్వం రైతుబంధు పైసలను రుణమాఫీకి వాడుకొని రైతులను మరోపక్క మోసం చేసింది కాబట్టి ఇప్పటికైనా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని గ్యారెంటీ కార్డులు పంపిణీ చేసింది కానీ ఇప్పటివరకు మహిళల అకౌంట్లో రూ. 2500 వేయలేదని, కౌలు రైతులకు రైతు భరోసా ప్రకటించలేదని, కరెంటు బిల్లులు, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు అమలు చేయలేదన్నారు. గ్యాస్ మరియు కరెంటు బిల్లుల మాఫీ విషయంలో టెక్నికల్ ప్రాబ్లం పేరుతో చాలామందిని మండల ఆఫీసులో చుట్టూ తిప్పుతున్నారన్నారు. తక్షణమే అర్హులైన పేదలందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ మండల శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మాసాడి ముత్యంరావు, మండల ప్రధాన కార్యదర్శి పారిపల్లి కొండారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కేసిరెడ్డి విజేందర్రెడ్డి, నర్ర శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకులు ఇనుకొండ తిరుపతిరెడ్డి, మరి రవీందర్, పంజాల లక్ష్మి, సంపత్ రెడ్డి, మండల సాయిబాబా, కొంకటి రమేష్, అంజిరెడ్డి, పాకాల నారాయణరెడ్డి, బేతి తిరుపతిరెడ్డి, ముద్రపోయిన గాలయ్య, పరశురాములు, తిరుపతి, రఘుపతిరెడ్డి, రాజేష్, నరెడ్ల ప్రవీణ్ రెడ్డి, భూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!