Social 1080×1350 • Multi-page
21-08-2024 BREAKING NEWS 06:02 AM
swarnodayam.com
Telugu Daily News

రైతులురుణమాఫీ పై ఆందోళన చెందవద్దు. -వోడితల ప్రణవ్

రైతులురుణమాఫీ పై ఆందోళన చెందవద్దు. -వోడితల ప్రణవ్
IMG-20240821-WA1093

–2 లక్షల వరకు రుణమాఫీ చేసే భాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది

– సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కానీ రైతులు వ్యవసాయ అధికారులను కలవాలి.

– మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీలో ఆలస్యం జరిగిన రైతులకు రుణమాఫీ చేసే భాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బుధవారం అన్నారు. రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఇప్పటికే విడతల వారీగా వారి ఖాతాలో డబ్బులు జమ చేశామని, మరల రెైతులు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చేలా తమ ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారనీ తెలిపారు. కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని, దీన్ని రైతులు గమనించాలని కోరారు. గత పదేళ్లలో రైతులు రుణమాఫీ పేరిట ఆగం అయ్యారని, ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీతో రైతులకు న్యాయం చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం లాగా లక్ష రుణమాఫీకి ఐదేండ్ల సమయం తీసుకోలేదని, అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఇచ్చిన మాట తప్పకుండా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని,
రుణమాఫీ కానీ రైతులు అందోళన చెందవద్దని సంబంధిత క్లస్టర్ వ్యవసాయశాఖ అధికారుల దగ్గరకు వెళ్లి పత్రాలను ఇస్తే వారు పరిశీలించిన తర్వాత రుణమాఫీ అవుతుందని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!