Social 1080×1350 • Multi-page
21-08-2024 BREAKING NEWS 06:37 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత

హుజురాబాద్ గ్రంథాలయానికి పోటీ పరీక్షల పుస్తకాల అందజేత
IMG_20240821_173538

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

డా. BN రావు హెల్త్ ఫౌండేషన్ NRI సంస్థ తరపున డా. B.N రావు హుజూరాబాద్ గ్రంథాలయ సంస్థ అధికారిణి కే లక్ష్మికి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతీ యువకులు ఈ పుస్తకాలను వినియోగించుకొని తమ భవిష్యత్తును తీర్చి దిద్దుకోవాలని కోరారు. అదే విధంగా తెలంగాణ ఆల్ పెన్సనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ గ్రంధాలయాలు యువత భవితను నిర్ణయించుటలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను యువతీ యువకులు శ్రద్ధగా చదువుకుని పోటీ పరీక్షలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయరావు, డా. రామలింగారెడ్డి, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, డా. విద్యాసాగర్, వేల్పుల రత్నం, గంగిశెట్టి జగదీశ్వర్, సయ్యద్ మునీరొద్దీన్, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, మోరె సతీష్, పాఠకులు శ్రావణి, అరుణ్, అజయ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!