22-08-2024 NORMAL NEWS 09:13 AM
swarnodayam.com
Telugu Daily News
22-08-2024 09:13 AM By Mandala Yadagiri

నంబర్ ప్లేట్ లేని 40 ద్విచక్ర వాహనాల సీజ్!

నంబర్ ప్లేట్ లేని 40 ద్విచక్ర వాహనాల సీజ్!
1000275431

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని, అస్తవ్యస్తంగా నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్న 40 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా టౌన్ సీఐ తిరుమల గడ్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రవాణా చట్టం ప్రకారం నంబర్ ప్లేట్లు కలిగి ఉండాలని, వాహన లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు ప్రభుత్వ నిబంధన ప్రకారం నడుచుకోవాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దుచేసినకై సిఫారసు చేయడం జరుగుతుందని సిఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరువురు ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!