22-08-2024 NORMAL NEWS 12:12 PM
swarnodayam.com
Telugu Daily News
22-08-2024 12:12 PM By Mandala Yadagiri

తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్ష నిర్వహణకు కొత్త షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్‌ -2 పరీక్ష నిర్వహణకు కొత్త షెడ్యూల్ విడుదల
1000011659

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్‌, ఆగస్టు 22:
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ వచ్చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్‌ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో గ్రూప్‌ 2 పరీక్షలను డిసెంబర్‌కు రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ప్రకటించిన టీజీపీఎస్సీ.. తాజాగా పరీక్షల షెడ్యూల్‌ని విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులకు 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!