Social 1080×1350 • Multi-page
23-08-2024 BREAKING NEWS 04:10 AM
swarnodayam.com
Telugu Daily News

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని..డీజీపికి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు.

దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని..డీజీపికి ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు.
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
నిన్న సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్ట్ లు శుక్రవారం డిజిపి జితేందర్ కు ఫిర్యాదు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడడం సహించరానిదన్నారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు విజయరెడ్డి, సరిత, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా నిన్న జరిగిన ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!