23-08-2024 NORMAL NEWS 08:03 AM
swarnodayam.com
Telugu Daily News
23-08-2024 08:03 AM By Mandala Yadagiri

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేయండి.. -హుజురాబాద్ ఆర్టీవో రమేష్.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేయండి.. -హుజురాబాద్ ఆర్టీవో రమేష్.
1000282950

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీలకతీతంగా అందరూ సహకరించి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని హుజురాబాద్ ఆర్టీవో ఎస్ రమేష్ పిలుపునిచ్చారు. ఈరోజు శుక్రవారం కేసి క్యాంప్ ఆర్డిఓ కార్యాలయంలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎస్ రమేష్ బాబు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటర్ల జాబితా అప్రమత్తం గురించి బూతు లెవల్లో ప్రజలు మరియు నాయకులు, ప్రజా ప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అధికారులకు ప్రజల మధ్య ప్రభుత్వం వారదిల కృషి చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు, అన్ని పార్టీల నాయకులకు అవగాహన అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సొల్లు బాబు, బిజెపి పార్టీ నుండి నాయకుడు తూర్పాటి రాజు, బిఆర్ఎస్ నుండి పోరెడ్డి కిషన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి కామని రాజేశం తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!