Social 1080×1350 • Multi-page
23-08-2024 BREAKING NEWS 12:27 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో 3 రోజులపాటు నల్లా నీరు సరఫరాకు అంతరాయం..!

హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో 3 రోజులపాటు నల్లా నీరు సరఫరాకు అంతరాయం..!
IMG_20240823_232545

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఆగష్టు 23:- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణములోని పలు ప్రాంతాలల్లో నల్లా నీరు సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ప్రజలు గమనించి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎస్ సమ్మయ్య, ఇంజనీర్ సాంబరాజు తెలిపారు. పట్టణ కేంద్రంలో గల సాయిబాబా టెంపుల్ రోడ్డు, హనుమాన్ టెంపుల్ రోడ్, జమ్మికుంట రోడ్, ప్రతాపవాడ, పోచమ్మ వాడ, మారుతి నగర్, సూపర్ బజార్ రోడ్డు, భూసారపు వాడ ప్రజలకు మూడు రోజుల పాటు నీటి సరఫరా బంద్ చేయడం జరుగుతుందని ఆయా ప్రాంతాల ప్రజలు గమనించగలరన్నారు. స్థానిక ఎస్ఐసి ఆఫీస్ వద్ద 600 డయా పైప్ లైన్ లీకేజీ రిపేరు చేస్తున్నదున మూడు రోజులపాటు ఈ ప్రాంత ప్రజలకు నల్లా నీరు సరఫరాకు అంతారాయం కలుగుతుందని పట్టణ పురపాలక సంఘం అధికారు తెలిపారు. కనుక ఈ ప్రాంత ప్రజలు సహకరించాలని కమిషనర్, అసిస్టెంట్ ఇంజనీర్ లు కోరారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!