24-08-2024 NORMAL NEWS 04:25 AM
swarnodayam.com
Telugu Daily News
24-08-2024 04:25 AM By Mandala Yadagiri

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఎన్నికలను విజయవంతం చేసిన నేతలకు సన్మానం

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ఎన్నికలను విజయవంతం చేసిన నేతలకు సన్మానం
IMG_20240824_152245

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మండల శాఖ అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, జిల్లా కో కన్వీనర్ చిలుక మారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో
పద్మశాలి చేనేత సహకార సంఘం పాలకవర్గముకు సన్మానం చేశారు.


ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం”అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి”సహకరించిన చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలిగేట్ ఉపేందర్ కి, ఉపాధ్యక్షుడు వేముల యాదగిరికి, కార్యాలయం మేనేజర్ నక్క వైకుంఠంకి, ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించిన ఎలగందుల వెంకటేశ్వర్లుకి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి జిల్లా కన్వీనర్ అడిచర్ల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పద్మశాలి కులస్తులందరూ ఐక్యంగా ఉండి సమస్యలపై ఉద్యమిస్తే ఎలాంటి ప్రభుత్వమైన దిగివస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్మశాలి కులస్తులు తమ సత్తా చాటి అత్యధిక స్థానాల్లో సర్పంచిగా, ఎంపిటిసిగా, జెడ్పిటిసిగా, ఎంపీపీలుగా గెలుపొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొక్కుల సమ్మయ్య, చెల్పూర్ గ్రామ సంఘం అధ్యక్షుడు ఆడెపు సమ్మయ్య, గుండేటి దేవయ్య, బింగి రాణి, కూరపాటి రామచంద్రం, బండి కోటేశ్వర్, మంతిని శ్రీహరి, తిరుపతి(గార్మెంట్), కుడికాల సాయి, ఇప్పలపల్లి చంద్రశేఖర్, గాలి సమ్మయ్య, జిల్లా పద్మశాలి సంఘం నాయకులు పోరాండ్ల రమేష్, ఇప్పలపల్లి శ్రీకాంత్, లింగమూర్తి మరియు పద్మశాలి కుల బాంధవులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!