Social 1080×1350 • Multi-page
24-08-2024 BREAKING NEWS 04:42 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రయాణికురాలికి బంగారం డబ్బు తిరిగి ఇచ్చిన ఆర్టీసీ కండక్టర్ కు మంత్రి పొన్నం అభినందనలు

ప్రయాణికురాలికి బంగారం డబ్బు తిరిగి ఇచ్చిన ఆర్టీసీ కండక్టర్ కు మంత్రి పొన్నం అభినందనలు
IMG_20240824_153938

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: బ‌స్సులో ప్ర‌యాణికురాలు మ‌రిచిపోయిన బంగారం, డ‌బ్బును తిరిగి అంద‌జేసి ఉదార‌త చాటుకున్న దుబ్బాక డిపో కండ‌క్ట‌ర్ దేవ‌మ్మ‌కు రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో అభినంద‌న‌లు తెలిపారు.

ప్ర‌యాణికుల‌ను క్షేమంగా గ‌మ్య‌స్థానాల‌కు చేర్చుతూనే.. మాన‌వ‌త్వంలో ఆర్టీసీ సిబ్బంది ముందుడ‌టం గొప్ప విష‌యం అని అన్నారు. ఆర్టీసి సిబ్బంది తమ విధులు నిర్వర్తిస్తునే ఆపత్కాల సమయంలో ఉదారత్వం చూపుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!