Social 1080×1350 • Multi-page
24-08-2024 BREAKING NEWS 07:51 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ఘనంగా ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు
IMG_20240824_184310

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కృష్ణ, గోపిక వేషధారణలో పాఠశాలకు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటామని, కృష్ణుడి పుట్టినరోజు కావున చాలా మంచి రోజు అని తెలిపారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో గోపిక, కృష్ణ వేషధారణలోని పిల్లలు నృత్యాలు చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో కార్యక్రమంలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొని సందడి చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమం అందరిని ఆనందింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతియాదవ్, ప్రిన్సిపాల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

హుజురాబాద్ మండలం సింగపురంలో విఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో కృష్ణాష్టమి ముందస్తు వేడుకను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో అలరించారు. పండుగ సంప్రదాయంలో భాగంగా కోలాటం ఆడి ఉత్సాహ భరితంగా ఉట్టికొట్టే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శనిగారం రజిత మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, పండుగ విశిష్టతల గురించి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించటానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునిడికి తెలిపాడని అన్నారు. భారత యుద్ధంలో పాండవుల పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవుల ఓటమికి కీలకపాత్ర వహించాడని తెలిపారు. భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. శ్రీకృష్ణాష్టమి పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తాల్లపెళ్లి అజయ్, పోతిరెడ్డి హరీష్, దుస గణేష్, గాజుల శారదా, చల్లురి సతీష్, గట్టు కోమల, తిరుపతి, భాస్కర్, సదయ్య, మహేశ్, రచన, విద్యార్థులు పాల్గొన్నారు.

ముందస్తుగా న్యూ కాకతీయ మోడల్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

-పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు గోపిక, శ్రీకృష్ణుని వేషధారణంతో ప్రత్యేక ఆకర్షణగా హాజరై ఉట్లు కొట్టి అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో
కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్ లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు, ఉపాధ్యాయుని ఉపాధ్యా యులు శ్రీనివాస్, రమేష్, శైలజ, మౌనిక, సంధ్యా, అశ్విని, సరిత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!