Social 1080×1350 • Multi-page
24-08-2024 BREAKING NEWS 08:30 AM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ విద్యార్ధి సముద్రాల వికాస్ కు “సిఎంఏ” లో 35వ ర్యాంకు

హుజురాబాద్ విద్యార్ధి సముద్రాల వికాస్ కు “సిఎంఏ” లో 35వ ర్యాంకు
Oplus_0

-ఇటీవల జరిగిన సిఏ లోనూ ఉత్తీర్ణత

-జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వికాస్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ ఆగస్టు24: హుజురాబాద్ పట్టణానికి చెందిన విద్యార్ధి సముద్రాల వికాస్ సిఎంఏ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 35 వ ర్యాంకు సాధించాడు. పట్టణానికి చెందిన ప్రయివేటు ఉద్యోగి సముద్రాల వేణుగోపాల్ – రమాదేవి దంపతుల కుమారుడైన వికాస్ ఈ ఏడాది జులైలో జరిగిన చార్టెడ్ అకౌంటెన్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. అలాగే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ (సిఎంఏ) పరీక్షల్లో జాతీయ స్థాయిలో 35వ ర్యాంకు సాధించాడు. దీనికి జాతీయ స్థాయిలో 16 వేల మందికి పైగా దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరయ్యారు. వికాస్ తాత సముద్రాల సత్తయ్య, కనకలక్ష్మి దంపతులు స్థానిక మార్కెట్ రోడ్డులో కిరాణం దుకాణం నిర్వహిస్తున్నారు.

మొదటి నుండి మెరిట్ విద్యార్థే..

వికాస్ మొదటి నుండి విద్యలో రాణిస్తున్నాడు. చార్టెడ్ అకౌంటెంట్ కావాలని చిన్నప్పటి నుండి లక్ష్యంగా పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు. వికాస్ ఐదో తరగతి వరకు కరీంనగర్ లోని మణిదీప్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో, ఆరు నుండి పదో తరగతి వరకు కరీంనగర్ లోని ప్రభుత్వ సవరణ్ స్కూల్ లో, ఇంటర్ తెలంగాణ మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కళాశాల తిమ్మాపూర్లో, సిఎ హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని లక్ష్య అకాడమీలో చదివాడు. విద్యలో, అకౌంటెన్సీలో మొదటి నుండి ఆసక్తితో చదివి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నాడు. సిఎంఏ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లోని ఉత్పాదకతను సంబంధించిన పరిశ్రమలు సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. భవిష్యత్లో సొంతంగా ఏదైనా సంస్థను స్థాపించి కొద్ది మందికి ఉపాధికల్పించాలనే లక్ష్యంతో వికాస్ పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే తాను జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించగలిగానని వికాస్ తెలిపాడు.

అభినందనల వెల్లువ

హుజురాబాద్ కు చెందిన సముద్రాల వికాస్ సిఎంఏ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి 35వ ర్యాంకు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందె రాధికా శ్రీనివాస్, విశ్రాంత ఏంఈఓ ఆలేటి మదన్ మోహన్ రెడ్డి, కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఎస్ రాజేంద్ర ప్రసాద్, యంసాని శశిధర్, గంగిశెట్టి ప్రభాకర్, కొమురవెల్లి రఘువీర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు గంగిశెట్టి రాజు, 1989 పూర్వ విద్యార్థులు, ప్రతినిధులు పోతిరెడ్డి రవీందర్, చలసాని వీరయ్యచౌదరి, నరహరి తిరుపతిరెడ్డి, నాగమల్ల శ్రీనివాస్, దేవోజుల శ్రీనివాస్, పరాంకుశం దిలీప్ కుమార్, రామక గోపిశర్మ, రావులకార్ వెంకటేష్ తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!