Social 1080×1350 • Multi-page
24-08-2024 BREAKING NEWS 10:09 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి – మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణ పై సమాచారం ఇవ్వండి – మంత్రి పొన్నం ప్రభాకర్
Oplus_0

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్ : ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యయానే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి అన్నారు. ఎంత పెద్ద వాళ్లు ఉన్న చెరువులు , కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారనీ స్పష్టం చేశారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం ఇది అన్నారు. మీ ప్రాంతంలో ఎక్కడ అర్టిఏ ద్వారా తీసుకున్న పూర్వీకుల దగ్గర నుండి వచ్చిన వారసత్వపు చెరువులు ఎక్కడెక్కడ ఉన్నయో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంత పెద్ద వారైనా ఏ పార్టీ వారైనా సమాచారాన్ని ప్రభుత్వానికి పిర్యాదు చేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు జరుగుతున్న కార్యక్రమంలో జంట నగరాల్లో హైదరాబాద్, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని భవిష్యత్ తరానికి చెరువులను కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలో స్వచ్చందంగా మీ ప్రాంతంలోని చెరువులను రక్షించుకోవడానికి ముందుకు రావాలి అన్నారు. ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా, వ్యక్తిగతంగా ఉద్దేశ్య పూర్వకంగా వ్యక్తుల మీద పార్టీల మీద జరుగుతున్న పోరాటం కాదు అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం పరివర్తన తేవాలని చేస్తున్న చర్య అని, తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో తీసుకున్న చర్య అన్నారు. ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురయ్యేయో అక్కడ సమాచారం ఇవ్వాలనీ ప్రజలకు పొన్నం సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!