Social 1080×1350 • Multi-page
25-08-2024 BREAKING NEWS 08:02 AM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు

ఘనంగా బీపీ మండల్ జయంతి వేడుకలు
1000304740

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి, హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ల జాతిపిత బిపి మండల్ 106వ జయంతి వేడుకలు ఆదివారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… బీహార్ కు చెందిన భూపేంద్రప్రసాద్ మండల్ బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడని, మురార్జీ దేశాయ్ కాలంలో బీసీల కోసం దేశమంతా తిరిగి 27శాతం రిజర్వేషన్ ఉండాలని ప్రతిపాదించారని అన్నారు. విపి సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన సిఫార్సులు ఆమోదించారని కానీ రాజకీయ కారణాలవల్ల అమల్లోకి రాలేదని అన్నారు. ఆయన ఆశయాలను పూర్తిచేస్తే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ , బీసీ నాయకులు సాదుల రవీందర్ బాబు, రిటైర్డ్ హెచ్ఎం వేల్పుల రత్నం, కొన్ని రాజిరెడ్డి, జన్నయ్య రామచంద్రం, మునీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!