Social 1080×1350 • Multi-page
26-08-2024 BREAKING NEWS 06:25 AM
swarnodayam.com
Telugu Daily News

సంస్థాగత బలోపేతం కొరకే సభ్యత్వ నమోదు – జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్

సంస్థాగత బలోపేతం కొరకే సభ్యత్వ నమోదు – జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్
IMG_20240826_172351

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సంస్థాగత బలోపేతం కొరకే సభ్యత్వ నమోదు చేపట్టడం జరుగుతుందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ పట్టణ శాఖ అద్వర్యంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు అధ్యక్షతన పట్టణంలోని శిశుమందిర్ లో బిజెపి సభ్యత్వ నమోదు సన్నాహాక కార్యాశాల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగత బలోపేతం కొరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నదన్నారు. బలమైన బిజెపి తోనే వికసిత్ భారత్ సాధ్యమైతదని తెలిపారు. ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీకి అత్యధిక సభ్యత్వం గల కార్యకర్తలు ఉన్నారని కొనియాడారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కొరకు ఎదురుచూస్తున్నారని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయస్థాయి నేత నుండి భూత్ స్థాయి కార్యకర్త వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొనాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండగల నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోనే హుజురాబాద్ పట్టణం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో నిలపడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఫ్లోర్ లీడర్ పైల్ల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు నల్ల సుమన్, సభ్యత్వ నమోదు ప్రముఖ్ కొలిపాక శ్రీనివాస్, సహా ప్రముఖ్ యాంసాని శశిధర్, నరల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శులు తూర్పాటి రాజు, వోడ్నాల విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పోతుల సంజీవ్, యాళ్ల సంజీవరెడ్డి, అంకటి శ్రీనివాస్, తిప్పబత్తిని రాజు, ఓబీసీ మోర్చ అధ్యక్షుడు గంట సంపత్, పట్టణ కార్యదర్శి పైడాకుల కొమరయ్య, శక్తి కేంద్ర ఇన్చార్జ్ కొలిపాక వెంకటేష్, భూత్ అధ్యక్షులు ములుగురి నాగరాజు, నపాక రాజు, క్యాస వెంకటేష్, గుండేటి భార్గవ్, పైడాకుల సదయ్య, నల్ల అజయ్, దేవేంద్ర, రమణ, కుసుమ సమ్మయ్య, మోలుగురి రాజు, కొండల్ రెడ్డి, గుర్రం సంతోష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!