Social 1080×1350 • Multi-page
26-08-2024 BREAKING NEWS 01:08 PM
swarnodayam.com
Telugu Daily News

చిన్న కోమటిపల్లిలో మూడేడ్ల సురేష్ అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నం!

–చికిత్స పొందుతూ మృతి

–కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాజకుమార్

స్వర్ణోదయం ప్రతినిధి, ఇల్లందకుంట ఆగస్టు 26: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామానికి చెందిన మూడేడ్ల సురేష్ అనే యువకుడు గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న కోమటిపల్లి గ్రామానికి చెందిన మూడెడ్ల రవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మూడేడ్ల సురేష్ కాగా అతడు ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. సురేష్ సరిగా పనిచేయక మద్యానికి బానిసై పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండేవాడు. ఈనెల 18న సాయంత్రం ఐదు గంటల సమయంలో మృతుడు సురేష్ తన తండ్రికి ఫోన్ చేసి నేను గడ్డిమందు తగిన అని చెప్పగా పిర్యాది దారుడు రవి తన అన్నకొడుకు రాజుకు చెప్పగా నెల్లి శేషుతో కలసి వెళ్లి హుటాహుటిన జమ్మికుంట మమతా హాస్పిటల్ తరలించడన్నారు. పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని డాక్టర్ చెప్పడంతో వరంగల్ అజార హాస్పిటల్ తరలించి చికిత్స పొందుతూండగా ఆజార హాస్పటల్ డాక్టర్ పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని చెప్పగా మెరుగైన చికిత్స గురించి హైదరాబాద్ తీసుకొని పోతుండగా మార్గమధ్యలో 25న అందధా 06:10పీఎం కు చనిపోయాడని 26న నేడు పిర్యాదు ఇవ్వగా ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు ఇల్లందకుంట ఎస్సై రాజకుమార్ తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!