Social 1080×1350 • Multi-page
27-08-2024 BREAKING NEWS 07:24 AM
swarnodayam.com
Telugu Daily News

బీఆర్ఎస్, బిజెపి కుమ్మక్కుతోనే కవితకు బెయిల్! – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు

బీఆర్ఎస్, బిజెపి కుమ్మక్కుతోనే కవితకు బెయిల్! – కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు
1000329791

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ కేంద్రంలోని బిజెపి పెద్దలతో కుమ్మక్కు కావడం వల్లే ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. మంగళవారం మీడియాకు వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలిసి బిజెపి పెద్దలతో కుమ్మక్కయ్యారని, దీంతో 163 రోజులపాటు తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ మంజూరు అయిందని మండిపడ్డారు. తరచూ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్తూ ప్రధానమంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి పెద్దలను కలుస్తూ కాళ్ళ వేళ్ళపై పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ ను బిజెపికి తాకట్టు పెట్టారని, ఈ విషయము ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు. మొన్నటి వరకు బిజెపి బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ ను దెబ్బతీయాలని చూశారని ధ్వజమె త్తారు. ఈ ఫ్యూహరచన అమలు కాలేదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అయ్యి బిజెపికి బిఆర్ఎస్ దాసోహం అయిందని, అందుకే వారి ఓట్లన్నీ బిజెపికి వేయించారని, కవితకు బెయిల్ కోసమే ఇలా చేశారని ఆరోపించారు. హరిశ్, కేటిఆర్ లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరుగుతూ ఆపద మొక్కులు మొక్కారనీ పేర్కొన్నారు. బిజెపి నేతల ఇండ్ల చుట్టూ తిరిగి కాళ్ళ మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకు న్నారనీ, బీఆర్ఎస్ ను ఢిల్లీ పెద్దల వద్ద తాకట్టు పెట్టారని తెలిపారు. ఈ విషయాలన్నిం టినీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని, బీజేపీ, బిఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు బయట పడ్డాయని విమర్శించారు. ప్రజలు బీఆర్ఎస్, బిజెపి ట్రాప్ లో పడ కుండా ఉండాలని సూచించారు. బీజేపీలో బిఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు అవుతుందనీ, ఇంకా బిజెపిలో బిఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందనీ పేర్కొన్నారు. ప్రజలు వీటన్నిటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆ రెండు పార్టీల వలలో చిక్కుకోవద్దని వెలిచాల రాజేందర్ రావు సూచించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!