Social 1080×1350 • Multi-page
27-08-2024 BREAKING NEWS 12:40 PM
swarnodayam.com
Telugu Daily News

బుడగ జంగాల స్మశాన వాటిక మంజూరు చేయించాల్సిందిగా ఎంపికి వినతి

బుడగ జంగాల స్మశాన వాటిక మంజూరు చేయించాల్సిందిగా ఎంపికి వినతి
IMG-20240827-WA1531

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ ని కలిసి హుజురాబాద్ 23వ వార్డు బేడ బుడగ జంగాల స్మశాన వాటికను మంజూరు చేయించాల్సిందిగా ఆయనకి వినతిపత్రం అందజేశారు. గత కొన్నేళ్ల నుండి స్మశాన వాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని సిరిపాటి వేణు వివరించారు. దీంతో ఈటెల రాజేందర్ స్పందించి సకాలంలో ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మారా శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుకుర్తి రాజేష్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గోదారి కొమురయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు చింతల అంజి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!