Social 1080×1350 • Multi-page
28-08-2024 BREAKING NEWS 08:18 PM
swarnodayam.com
Telugu Daily News

ఉట్టి కొట్టి ఉత్సాహపరిచిన వోడితల ప్రణవ్..చిన్నారులకు బహుమతులు అందజేత.!

ఉట్టి కొట్టి ఉత్సాహపరిచిన వోడితల ప్రణవ్..చిన్నారులకు బహుమతులు అందజేత.!
IMG_20240829_071520

–రాధా కృష్ణుల వేషధారణలో చిన్నారులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో ఉట్టి కొట్టే కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల పాల్గొని చిన్నారులను ఉత్సహ పరిచారు. అంతకుముందు శ్రీకృష్ణ యూత్ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చిన్న పిల్లలు రాధ, కృష్ణా, వేషధారణలతో పలువురుని ఆకట్టుకున్నారు.
పాలవెల్లి కార్యక్రమంలో వోడితల ప్రణవ్ పాల్గొని ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టి కార్యక్రమంలో మొదటిగా పాల్గొని ఉట్టి కొట్టి యువకులను ఉత్సాహా పరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా పతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమ నిర్వహకులు, పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!