Social 1080×1350 • Multi-page
28-08-2024 BREAKING NEWS 08:44 PM
swarnodayam.com
Telugu Daily News

అర్ధరాత్రి హుజురాబాద్ లో పోలీసుల హల్ చల్! ప్రత్యేక తనిఖీలతో ప్రజలకు భద్రత భావం కల్పించిన సీఐ.

అర్ధరాత్రి హుజురాబాద్ లో పోలీసుల హల్ చల్! ప్రత్యేక తనిఖీలతో ప్రజలకు భద్రత భావం కల్పించిన సీఐ.
IMG_20240829_074204

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: అర్ధరాత్రి హుజురాబాద్ పట్టణంలో ప్రత్యేక తనిఖీలతో పోలీసులు ప్రజలకు ఉన్న భయాన్ని తొలగించారు. హుజురాబాద్ పట్టణంలో అర్ధరాత్రి ఆకతాయిలు వాహనాలపై రేసు పోటీలకు పాల్పడుతుండగా, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన టౌన్ సిఐ జి తిరుమల్ గౌడ్ అకస్మాత్తుగా అర్ధరాత్రి ప్రత్యేక తనిఖీలకు పూనుకున్నారు. హుజురాబాద్ బస్టాండ్, మరియు లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించారు. పట్టణంలో అర్ధరాత్రి ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులున్నారు జాగ్రత్త అని సంకేతాలను ఈ ప్రత్యేకతనికి ద్వారా సిఐ కల్పించారు. గతంలో ఎవరు చేయని ఈ సహాయాన్ని ఇటీవల నూతనంగా బాధితులు స్వీకరించిన టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ చేపట్టడంతో పట్టణ ప్రజల్లో అంతకుముందు ఉన్న అభద్రత భావం తొలగినట్లు అయింది ఈ ప్రత్యేకతనిఖీల్లో హుజురాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి తిరుమల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ యూనస్ అహ్మద్ అలీ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!