Social 1080×1350 • Multi-page
28-08-2024 BREAKING NEWS 11:32 PM
swarnodayam.com
Telugu Daily News

అర్ధరాత్రి కారు హల్ చల్.. ఇంటి ముందు ఉంచిన మరో కారు, మెట్ల స్టాండ్ ను ఢీ కొట్టిన కారు.

అర్ధరాత్రి కారు హల్ చల్.. ఇంటి ముందు ఉంచిన మరో కారు, మెట్ల స్టాండ్ ను ఢీ కొట్టిన కారు.
IMG-20240829-WA0669

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో కోర్టు ఎదురుగా ఉన్న మంచికట్ల వెంకటయ్య ఇంటి వద్ద అద్దెకు ఉంటున్న అవధానాల శంకర్ అయ్యా శర్మకు చెందిన కారును మరో కారు అతివేగంగా ఆజాగ్రత్తగా వచ్చి ఇంటి ఎదుట నిలిపి ఉంచిన కారును, ఇనుప మెట్ల స్టాండును ఢీ కొట్టింది. అర్ధరాత్రి సుమారు ఒకటి నర తర్వాత ముగ్గురు వ్యక్తులు ఉన్న స్విఫ్ట్ కారు అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాల మూల మలుపు వద్ద అదుపుతప్పి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తులు పట్టణానికి చెందిన వ్యక్తులుగానే పోలీసులు గుర్తించారు. ఇటీవల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి కాగా పెళ్లికి సంబంధించిన బంధువుల కారుగా స్థానికులు భావిస్తున్నారు. అర్ధరాత్రి మద్య మత్తులోనే కారు నడిపి ఢీకొట్టినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. రోడ్డు దాటి ఇంటి లోపలి వరకు చూసుకుంటూ వెళ్లి ఇంటి ముందు నిలిపి ఉన్న కారును ఢీ కొట్టి మెట్ల స్టాండ్ ను ఢీకొట్టి కారూ ఆగడం కారు అతివేగానికి సాక్ష్యంగా నిలిచింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయాలు కాగా అదే రాత్రి బ్లూ కోర్టు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించి నట్లు తెలిసింది. ఆస్తి ధ్వంసానికి కారణమైన కారుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!