Social 1080×1350 • Multi-page
29-08-2024 BREAKING NEWS 12:37 PM
swarnodayam.com
Telugu Daily News

పెంచికల్ పేట వద్ద రోడ్డు ప్రమాదం..స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన బీఆర్ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్.

పెంచికల్ పేట వద్ద రోడ్డు ప్రమాదం..స్పందించి  క్షతగాత్రులను  ఆసుపత్రికి తరలించిన బీఆర్ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్.
IMG-20240829-WA0731

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ శివారులోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట సమీపంలో ఉన్న అన్నదాత సీడ్స్ వద్ద వరంగల్ – కరీంనగర్ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమకొండ వైపు నుండి హుజురాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదే రూట్ లో వెళ్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఇదే సమయంలో డీసీఎం వెనుక వైపు నుండి తన కారులో వస్తున్న హూజురాబాదుకు చెందిన బిఆర్ ఎస్ పార్టీ యువ నేత మొలుగు పూర్ణచందర్ వెంటనే తన వాహనాన్ని నిలిపి.. క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్స్ తెప్పించి హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ఆసుపత్రి వైద్యులను సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని వైద్యులను సిబ్బందిని కోరారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో వల్బాపూర్ తో పాటు హుజురాబాద్ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మానవత్వంతో తక్షణమే స్పందించి అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ 108 అందుబాటులో లేకపోవడంతో వెంటనే ప్రైవేటు అంబులెన్స్ తెప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం కృషిచేసిన బిఆర్ ఎస్ యువనేత మొలుగు పూర్ణచందర్ ను స్థానికులతో పాటు పలువురు అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!