Social 1080×1350 • Multi-page
31-08-2024 BREAKING NEWS 12:53 AM
swarnodayam.com
Telugu Daily News

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికివోడితల ప్రణవ్ సంతాపం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికివోడితల ప్రణవ్ సంతాపం
IMG-20240821-WA1093

–గాయపడ్డ వారికి మెరుగైన వైద్య అందించాలి.

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని హుజురాబాద్ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామం నుండి కొత్తగట్టు గ్రామంలో గల మత్స్యగిరింద్ర స్వామి దేవాలయానికి ఉదయం నాలుగున్నర గంటల సమయంలో వెళ్తుండగా సింగపూర్ గ్రామం వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సంఘటనలను తెలుసుకున్న వోడితల ప్రణవ్ మృతిచెందిన తాడూరి రాజమౌళి కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేయడంతో పాటు గాయపడిన బాధితులకు అత్యవసరమైన చికిత్స అందించాలని కోరారు. వివాహానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!